నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లికి చెందిన న్యాయవాది మల్లయ్య హత్యకు నిరసనగా నారాయణపేట జిల్లా మక్తల్ కోర్టులో న్యాయవాదులు సోమవారం తమ విధులను నిలిపివేశారు. కోర్టు ఆవరణలో సమావేశమైన లాయర్లు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యాయవాదులపై వరుసగా జరుగుతున్న దాడులను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. మల్లయ్యను హత్య చేసిన నిందితులను గుర్తించి, వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని లాయర్లు డిమాండ్ చేశారు. తమ వృత్తిలో భద్రత కరువైందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

న్యాయవాదుల రక్షణ కోసం ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా ప్రభుత్వం సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రంకుల ఆనంద్, సూర్యప్రకాశ్, జి. సురేందర్, వెంకటేష్ గౌడ్, ఎస్. శివకుమార్, సురేందర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.