అస్సాం ప్రభుత్వం వరద బాధితుల కోసం రూ. 160 కోట్ల మధ్యంతర సహాయాన్ని ప్రకటించింది. వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న 75 వేల కుటుంబాలను గుర్తించి, ఒక్కో కుటుంబానికి రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసింది.
ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో సహాయక మరియు పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దిబ్రూగఢ్ నుంచి ఆయన ఈ ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు.
బాధితులకు ఆర్థిక సాయంతో పాటు, అర్హత కలిగిన కుటుంబాలకు 'ప్రధాన మంత్రి సూర్య ఘర్' పథకం కింద సబ్సిడీని కూడా ప్రభుత్వం అందిస్తోంది. వరద పరిస్థితులపై ప్రభుత్వం నిరంతరం సమీక్ష చేస్తూ, సహాయక చర్యలను వేగవంతం చేస్తోంది.








