హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా తాజాగా దేశీయ విపణిలో నాలుగు ప్రీమియం బైక్‌లను ఆవిష్కరించింది. వీటిలో సీబీ750 హార్నెట్, ఎక్స్‌ఎల్‌750 ట్రాన్స్‌ఆల్ప్‌ మోడళ్లు ప్రధానమైనవి. తనకు మంచి ఆదరణ ఉన్న 755 సీసీ ఇంజిన్‌ ప్లాట్‌ఫామ్‌కు కొత్తగా ‘ఈ–క్లచ్‌’ టెక్నాలజీని జోడించడం వీటి ప్రత్యేకత.

సుదూర ప్రయాణాలను ఇష్టపడేవారి కోసం ‘గోల్డ్‌ వింగ్‌’ లగ్జరీ టూరర్‌ను సరికొత్త రంగు ఎంపికలో సంస్థ తీసుకొచ్చింది. వేగాన్ని కోరుకునే రేసింగ్‌ ప్రియుల కోసం అత్యున్నత శ్రేణి సూపర్‌స్పోర్ట్‌ బైక్‌ సీబీఆర్‌1000ఆర్‌ఆర్‌–ఆర్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది.