భారత వాయుసేనకు చెందిన ఏఎన్–32 రవాణా విమానం శనివారం అస్సాంలో కుప్పకూలిన ఘటనలో ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జోర్హాట్ జిల్లాలోని రౌరియా వైమానిక స్థావరం వద్ద దిగే ప్రయత్నంలో ఈ విమానం కూలిపోయినట్లు రక్షణ శాఖ ప్రతినిధి వివరించారు. ఇది 43వ స్క్వాడ్రన్‌కు చెందినదని పేర్కొన్నారు.
ప్రాణాలు కోల్పోయిన వారిలో పైలట్ ప్రశాంత్ సింగ్‌తో పాటు శుభమ్ కుమార్, జితేంద్ర శర్మ, ఖేమారామ్ తదితరులు ఉన్నట్లు వాయుసేన ప్రకటించింది. ఈ దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టనున్నారు.








