కేంద్రం జూలై 1 నుంచి తీసుకురావాలని భావిస్తున్న వీబీజీ రాంజీ పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అభ్యంతరం తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ పంపనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క వెల్లడించారు.
ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభ ఇప్పటికే ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కొత్త విధానాన్ని జూలై నుంచే అమలు చేయాలంటూ కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో, తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను లిఖితపూర్వకంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.





