అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో రికార్డు విజయం నమోదు చేసిన భారత జట్టు, వన్డే సిరీస్‌ను కూడా గెలుపుతోనే ప్రారంభించింది. ధర్మశాలలో వర్షం వల్ల 25 ఓవర్లకు పరిమితమైన తొలి మ్యాచ్‌లో అఫ్గాన్ ఆటగాడు గుర్బాజ్ సెంచరీ చేసినా, ఆ జట్టు ఓ మోస్తరు స్కోరుకే ఆగిపోయింది.
అరంగేట్రం చేసిన బౌలర్లు గుర్‌నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. ఛేదనలో కెప్టెన్ గిల్ నిలకడగా ఆడగా, రాహుల్, ఇషాన్ చెలరేగడంతో టీమిండియా సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది.






