సాంకేతిక దిగ్గజం గూగుల్ ఇప్పుడు దోమలపై దృష్టి సారించింది. ఆ సంస్థ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టే లక్ష్యంతో ‘ప్రాజెక్ట్ డీబగ్’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇందులో భాగంగా అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో రాబోయే రెండేళ్లలో 6.4 కోట్ల మగ దోమలను విడుదల చేసేందుకు అనుమతి కోరుతూ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ మగ దోమల్లో సహజంగా ఉండే వోల్‌బ్యాకియా అనే బ్యాక్టీరియా దోమల సంతతిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.








