హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’. మురళీకాంత్ దర్శకత్వంలో కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సినిమాను దీప్తి గంట నిర్మిస్తుండగా, హీరో నాని సమర్పిస్తున్నారు. ఈ గ్లింప్స్ వీడియోకు నాని స్వయంగా వాయిస్ ఓవర్ ఇచ్చారు. వీడియోను బట్టి చూస్తే, ఈ సినిమాలో నితిన్ ఒక రచయిత పాత్రలో కనిపిస్తారని స్పష్టమవుతోంది.
ప్రస్తుతానికి చిత్ర బృందం గ్లింప్స్‌ను మాత్రమే విడుదల చేసింది. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.








