తనకు ఎప్పుడూ కథే ప్రధానమని, మంచి కథ ఉంటేనే సినిమా ప్రేక్షకులను నిలబెడుతుందని నటుడు తిరువీర్ అభిప్రాయపడ్డారు. తన కొత్త చిత్రం ‘ఓ..! సుకుమారి’లో కథతో పాటు కామెడీ, ఎమోషన్స్ అన్నీ చక్కగా సమకూరాయని ఆయన చెప్పారు. గతంలో తాను నటించిన ‘మసూద’ చిత్రాన్ని కుటుంబ ప్రేక్షకులు ఆదరించినట్లే, ఈ సినిమాకూ అదే స్పందన లభిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో తిరువీర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించారు. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.





