ఎపిక్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ ‘నాగబంధం– ది సీక్రెట్‌ ట్రెజర్‌’ జూలై 3న ప్రపంచవ్యాప్త విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో విరాట్‌ కర్ణ కథానాయకుడిగా నటించగా, అభిషేక్‌ నామా మెగాఫోన్‌ పట్టారు. కిషోర్‌ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి కలిసి నిక్‌ స్టూడియోస్‌ ద్వారా దీన్ని భారీ వ్యయంతో నిర్మించారు.

నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్‌ మంజ్రేకర్‌ వంటి నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. కథలో నిధి అన్వేషణ నేపథ్యం ఉండటంతో, అదే తరహాలో ఆసక్తికర ప్రచార వ్యూహాన్ని చిత్రబృందం సిద్ధం చేయడం విశేషం.