ఈ సీజన్‌లో వరుస ప్రతిష్ఠాత్మక టోర్నీలకు భారత హాకీ జట్టు సన్నద్ధమవుతోంది. ఆగస్టు 15 నుంచి 30 వరకు ప్రపంచ కప్‌లో, అనంతరం సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడల్లో జట్టు తలపడనుంది.
వీటికి ముందు తమ ఆటను మెరుగుపరచుకునే ఉద్దేశంతో యూరోప్‌లో జరిగే ప్రొ లీగ్ టోర్నీలో పాల్గొంటోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు ఈ టూర్‌లో పటిష్ఠమైన యూరోపియన్ జట్లతో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉంది.






