అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 సదస్సు వేదికగా ముఖాముఖి భేటీ కానున్నారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందంపై అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఉందని వైట్‌హౌస్‌ వెల్లడించింది.

గత ఏడాది ఫిబ్రవరిలో మోదీ వాషింగ్టన్‌ పర్యటన తర్వాత వీరిద్దరూ ప్రత్యక్షంగా కలవడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత పలుమార్లు ఫోన్‌ ద్వారా మాట్లాడుకున్నప్పటికీ, ఈసారి నేరుగా చర్చలు జరపనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.