మేడ్చల్ జిల్లా ఎల్లంపేటలోని శ్రీరంగవరంలో గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న శ్రీనివాస్ (37), ప్రవళిక (14), హరిప్రియ (10), విక్రాంత్ (6) తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించిన సిబ్బంది, మెరుగైన వైద్యం కోసం వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిలిండర్ పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








