హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ వి.ప్రతీక్ష, శ్రీలంక పర్యటనకు ఎంపికైన భారత మహిళల అండర్–19 జట్టులో చోటు దక్కించుకుంది. భవికా అహిరే సారథ్యంలోని పదిహేను మంది బృందంలో ఆమెకు అవకాశం లభించింది. దేశవాళీ స్థాయిలో ఇటీవల చూపిన నిలకడైన ఆటే ఆమె ఎంపికకు దోహదపడింది.
మీర్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆమెకు ముస్తఫా అలీ, వసీం అలీ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. పుదుచ్చేరి వేదికగా జూన్ 30, జూలై 3, 6 తేదీల్లో రెండు జట్ల నడుమ మూడు వన్డేల పోరు సాగనుంది.






