ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ప్రదర్శనను నేరస్తులు హైజాక్ చేశారని బీజేపీ ప్రతినిధి ఎన్వీ సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రదర్శనలో సుమారు 3,000 మంది నేర చరిత్ర ఉన్న వ్యక్తులు పాల్గొన్నారని ఆయన వెల్లడించారు.
వీరిలో 101 మంది హత్య కేసుల్లో నిందితులుగా ఉండగా, 62 మంది హత్యాయత్నం కేసుల్లో ఉన్నారని సుభాష్ వివరించారు. అంతేకాకుండా, ఇప్పటికే 60 మంది వివిధ నేరాల్లో దోషులుగా నిర్ధారించబడ్డారని ఆయన పేర్కొన్నారు.
నిజమైన విద్యార్థులు ఈ ప్రదర్శనలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని ఆయన తెలిపారు. విద్యార్థుల ముసుగులో ఉన్న ఈ నేరస్తులు ప్రభుత్వాన్ని దోపిడీ చేసేందుకు ఈ ప్రదర్శనను వాడుకుంటున్నారని బీజేపీ ప్రతినిధి ఆరోపించారు.








