మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో జరిగిన ఓ ప్రమాదంలో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 12వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి వేళ ఈదురుగాలులు బలంగా వీచిన సమయంలో, సభావత్‌ రమేష్‌ ఇంటి వెనుక ఉన్న భారీ తాటిచెట్టు మొదలంటా విరిగి ఇంటిపై కూలిపోయింది.

చెట్టు బరువుకు పైకప్పు రేకులు విరిగి, ఇంట్లో ఉన్న 75 ఏళ్ల లక్ష్మీసేవ్యపై పడ్డాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఇన్‌స్పెక్టర్‌ బి.శోభన్‌ వెల్లడించారు.