ఇరాన్, అమెరికా మధ్య చిరకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెర దించే కీలక ఒప్పందం ఆదివారం కుదిరే సూచనలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ అంగీకారం ఖరారైతే అంతర్జాతీయ చమురు సరఫరాకు జీవనాడి వంటి హోర్ముజ్ జలసంధి తిరిగి అందుబాటులోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రెండు దేశాల బంధంలో ఇది ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌తో సహా మధ్యప్రాచ్య దేశాలన్నింటితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలన్నదే తమ ఆకాంక్ష అని ఆయన తన సామాజిక మాధ్యమ ఖాతాలో తెలిపారు.








