భారత రక్షణ సామర్థ్యంలో మరో కీలక ముందడుగు పడింది. శత్రుదేశాల ఖండాంతర క్షిపణుల దాడిని అడ్డుకుని ధ్వంసం చేసే బాలిస్టిక్‌ మిసైల్‌ డిఫెన్స్‌ (బీఎండీ) సాంకేతికతను రక్షణ పరిశోధన సంస్థ డీఆర్‌డీఓ విజయవంతంగా అభివృద్ధి చేసింది. దీన్ని దేశ రక్షణ రంగంలో ఒక మైలురాయిగా పేర్కొంటున్నారు.

బాలిస్టిక్‌ క్షిపణుల ఛేదనతో పాటు యాంటీ–షిప్‌ యుద్ధ సామర్థ్యంలోనూ ఈ నూతన సాంకేతికత సత్తా చాటింది. భవిష్యత్తులో ఎక్కువ దూరం నుంచి దూసుకొచ్చే క్షిపణులను సైతం నిలువరించే దిశగా ఇది ఉపయోగపడనుంది.