సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు దుర్ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. రాజీవ్‌ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకోవడంతో పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కరీంనగర్‌ వైపు నుంచి హైదరాబాద్‌కు దూసుకొస్తున్న ఒక మారుతి కారు, అడ్డంగా రహదారి దాటుతున్నవారిని తప్పించబోయే ప్రయత్నంలో అదుపు తప్పింది.

మితిమీరిన వేగంతో ఉన్న ఆ కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి, రోడ్డు పక్కనే ఉన్నవారిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో రాధవ్వ (60) సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.